అగ్నిమాపక భద్రత నియమాలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

అగ్నిమాపక భద్రత నియమాలు పాటించాలి

Apr 15 2026 7:32 AM | Updated on Apr 15 2026 7:32 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రతీ పౌరుడు అగ్నిమాపక భద్రతా నియమాలు పాటించాలని వాసవీ క్లబ్‌ అధ్యక్షుడు ఉదయ్‌బాబు, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సురేశ్‌కుమార్‌ అన్నారు. జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయం వద్ద అధికారులు, సిబ్బందిని వాసవీ క్లబ్‌ సభ్యులు సత్కరించారు. జిల్లా అధికారి సురేశ్‌కుమార్‌ మాట్లాడుతూ 1944 ఏప్రిల్‌ 14న ముంబై నౌకాశ్రయంలోని విక్టోరియా డాక్‌ వద్ద ఎస్‌ఎస్‌ ఫోర్ట్‌ స్టికై న్‌ నౌకలో భారీ పేలుడు సంభవించిందని, మంటలు అదుపు చేయడంలో 66 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. నివాళిగా ఏటా అగ్నిమాపక దినోత్సవం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. క్లబ్‌ కార్యదర్శి శ్రీనివాస్‌, కోశాధికారి కలకుంట్ల శ్రీధర్‌, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement