కౌటాల: మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో బుధవారం హిందూ మహా సమ్మేళ నం నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ విభాగ్ సహా కార్యవహా మాధవరం రంగస్వామి తెలిపా రు. స్థానిక వాసవీమాత ఆలయ ప్రాంగణంలో మంగళవారం నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ సమ్మేళనానికి మహాదేవ్ ధర్మ పీఠం గుడిమెట్ సద్గురు మహాదేవ్ స్వామిజీ హాజరవుతారని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న సమ్మేళానికి ఏర్పాట్లు చేశామన్నారు. హిందువులందరూ సకాలంలో హాజ రు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు దౌలత్, ఎల్ములే దత్తు, ప్రభీర్, సత్యనారాయణ, కుంచాల విజయ్, అనిల్, తిరుపతిరెడ్డి, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.


