బాధ్యతగా వ్యవహరిస్తే ప్రమాదాల నివారణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా వ్యవహరిస్తే ప్రమాదాల నివారణ

Apr 15 2026 7:32 AM | Updated on Apr 15 2026 7:32 AM

రెబ్బెన: ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే ప్రమాదాలు నివారించవచ్చని ఏఎస్పీ చిత్తరంజన్‌ అన్నారు. అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గోలేటి టౌన్‌షిప్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయ సాధన దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించడం ద్వారా విలువైన ప్రాణాలను రక్షించుకోవచ్చని అన్నారు. యువత ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్‌ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్‌, ఎస్సై వెంకటకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement