ఎండతో ఉక్కిరిబిక్కిరి | - | Sakshi
Sakshi News home page

ఎండతో ఉక్కిరిబిక్కిరి

Apr 15 2026 7:32 AM | Updated on Apr 15 2026 7:32 AM

● పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు ● వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం ● నిర్మానుష్యంగా ప్రధాన రహదారులు

కాగజ్‌నగర్‌టౌన్‌: ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అ వుతున్నారు. సగటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సి యస్‌ దాటాయి. మరో వారం పాటు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వేడి, ఉక్కపోత పెరిగిన నేపథ్యంలో అధికా రులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. మొన్నటి వరకు 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదుకాగా, మంగళవారం పలు మండలాల్లో 43 డిగ్రీలకు చేరువగా నమోదయ్యాయి. వడగాల్పులు తీవ్రత కూడా పెరిగింది.

వడదెబ్బ ముప్పు

రోజురోజుకూ పెరుగుతున్న ఎండల దృష్ట్యా వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు తీసుకోవాలి. శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. బయటి వాతావరనంలో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు దాటినప్పుడు శరీ రం ఎండ ప్రభావానికి లోనవుతుంది. ఉక్కపోతగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో చల్లబడేందుకు శరీరం నుంచి చెమట వస్తుంది. తగిన నీటిని తీసుకోకుండా, ఎండల్లో తిరిగితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండటం ఉత్తమం. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉప్పు కలిపిన మజ్జిగ లేదా పళ్ల రసాలు, చల్లని నిమ్మరసం, కొబ్బరి నీరు తాగాలి. తెల్లని వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి. తప్పనిసరిగా గొడుగు, నెత్తిపై టోపి వాడాలి. కనీసం ఐదు లీటర్ల నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

తక్షణ వైద్యం అందించాలి

వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ప్రదేశానికి చేర్చాలి. శరీరంపై దుస్తులను తొలగించి చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. ఐస్‌ముక్కల ను గుడ్డతో ఉంచి శరీరం అంతా అద్దితే చాలా మంచిది. శరీరమంతా చల్లని గాలి తగిలేలా చూ డాలి. బాధితుడికి చల్లని నీరు లేదా ఉప్పు, ఇతర లవణాలు కలిగిన నీటిని తాగించాలి. అపస్మారక స్థితిలో ఉంటే నీరు తాగించొద్దు. స్పృహ కోల్పోతే మాత్రం సమయం వృథా చేయకుండా తక్షణ వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు చేయాలి.

– డాక్టర్‌ అవినాష్‌, సూపరింటెండెంట్‌,

కాగజ్‌నగర్‌ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి

జిల్లాలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు (డిగ్రీ సెల్సియస్‌లో)

ప్రాంతం ఉష్ణోగ్రతలు

ఆసిఫాబాద్‌ 42.7

సిర్పూర్‌(టి) 42.6

రెబ్బెన 42.5

కెరమెరి 42.5

తిర్యాణి 42.1

కాగజ్‌నగర్‌ 41.7

వాంకిడి 41.5

బెజ్జూర్‌ 40.8

కౌటాల 40.7

చింతలమానెపల్లి 40.6

పెంచికల్‌పేట్‌ 40.3

దహెగాం 40.1

Advertisement
 
Advertisement
Advertisement