ఆసిఫాబాద్: అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం.. అన్నివర్గాలకు ఆర్థిక సామాజిక న్యాయం, రాజకీయ రంగాల్లో సమన్యాయం కల్పించడం కోసం అంబేడ్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కె.హరిత అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావే శ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనకు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సి ర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మాట్లాడు తూ ప్రపంచ దేశాలు అంబేడ్కర్ ఆలోచనలపై దృష్టి సారిస్తున్నాయన్నారు. అలాంటి మేధావి భారత పౌరుడు కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. యువత విద్యపై దృష్టి సారించి ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ అంబేడ్కర్ కేవలం రాజ్యాంగ రచయిత మాత్రమే కాదని, సమానత్వం, స్వేచ్ఛ, అంటరానితనం నిర్మూలన, సోదర భావం, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. విద్యార్థులకు అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ జీవిత చరిత్రలపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి, విజేతలకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి అశోక్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నేత శ్యాంనాయక్, కుల సంఘాల ప్రతినిధులు దుర్గం తుకారాం, కేశవరావు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


