రహదారి నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

రహదారి నిబంధనలు పాటించాలి

Apr 15 2026 7:32 AM | Updated on Apr 15 2026 7:32 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, కా రులో ప్రయాణించేవారు సీట్‌ బెల్టు ధరించా లని సూచించారు. మద్యం తాగి నడపడం, మొబైల్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం ప్రమాదకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రులకు తరలించాల ని, గోల్డెన్‌ అవర్‌లో బాధితులను ఆస్పత్రుల కు తరలిస్తే రహవీర్‌ పథకం ద్వారా రూ.25వేల నగదు పురస్కారం అందిస్తారని తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ రహదారి నిబంధనలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. హెల్మెట్‌ లేని ప్రయాణాల్లో తలకు గాయాల తీరును వాటర్‌ మిలన్‌లో ట్రయల్‌ చేసి ప్రదర్శించా రు. అనంతరం రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధా శుక్లా, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాశ్‌, వైస్‌ చైర్మన్‌ అహ్మద్‌, జిల్లా రవాణా అధికారి రాంచందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement