కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం డిపార్టుమెంట్ ఆఫ్ హిస్టరీ ఆధ్వర్యంలో పురాతన నాణేల ప్రదర్శ న నిర్వహించారు. వందేళ్ల కాలం నాటి రాగి, ఇత్తడి నాణేలు, స్వాతంత్య్రానికి పూర్వం చలామణిలో ఉన్న వివిధ రకాల నాణేలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ పురాతన నాణేల ప్రదర్శనతో విద్యార్థులు చరిత్ర తెలుసుకోగలుగుతారని అన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, కోఆర్డినేటర్ దుర్గం జనార్దన్, అధ్యాపకులు సబిత, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


