ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి

Apr 14 2026 7:28 AM | Updated on Apr 14 2026 7:28 AM

ఉట్నూర్‌రూరల్‌: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ ఏవో దామోదరస్వామి అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్వీకరించారు. కెరమెరి మండలం సంఘవి గ్రామానికి చెందిన మడావి రాంబాయి రైతు భరోసా మంజూరు చేయాలని, ఉట్నూర్‌ మండలం వేణునగర్‌కు చెందిన రాథోడ్‌ సుభాష్‌ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, మంచిర్యాలకు చెందిన ఆత్రం రవికిరణ్‌ రుణం మంజూరు చేయాలని కోరారు. ఇంకా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్‌, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని

దరఖాస్తులు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement