జైపూర్: రక్తదానం మహాదానం అని ఎస్టీపీపీ ఈడీ సీహెచ్.చిరంజీవి పేర్కొన్నారు. బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్టీపీపీలోని ట్రెయినీ హాస్టల్‌లో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ జయంతి సందర్భంగా వరుసగా ఏడవసారి రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సోసైటీ జిల్లా జనరల్ సెక్రెటరీ చందూరి మహేందర్, ఎస్టీపీపీ జీఎం నర్సింహారావు, సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సుధేశ్ జఖహర్, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవోఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ పంతులా, ఎస్సీ లైసన్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎస్టీ లైసన్ ఆఫీసర్ దేవేందర్‌సింగ్, పీఎంపీఎల్ హెడ్ అఖిల్‌కపూర్, మెడికల్ సూపరింటెండెంట్ జానకి ప్రభాకర్, ఎస్‌వోటూ ఈడీ వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.


