వ్యక్తిపై హిజ్రాల దాడి | - | Sakshi
Sakshi News home page

వ్యక్తిపై హిజ్రాల దాడి

Apr 14 2026 7:28 AM | Updated on Apr 14 2026 7:28 AM

లక్ష్మణచాంద: ఒకరిపై హిజ్రాలు దాడికి పాల్ప డిన ఘటన మండలంలోని చింతల్‌చాందలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన లింగట్ల రాజన్న ఆదివారం గృహ ప్రవేశ కార్యక్రమం జరుగుతోంది. రాత్రి ఏడు గంటలకు నిర్మల్‌కు చెందిన నలుగురు హిజ్రాలు ఒక ఆటోలో వచ్చి రూ.11 వేలు కట్నంగా ఇ వ్వాలని డిమాండ్‌ చేశారు. తమకు అంతస్థోమ త లేదని, రూ.3 వేలు ఇస్తానని రాజన్న తెలిపా డు. ఒప్పుకోని హిజ్రాలు రాజన్నను చేతులతో కొట్టి బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కొద్దిదూరం వెళ్లిన తర్వాత కిందకు తోసేశారు. దీంతో ఆటో రెండు టైర్లు బాధితుడి కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. కు టుంబ సభ్యులు నిర్మల్‌ ఆసుపత్రికి తరలించా రు. బాధితుడి భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement