అనారోగ్యంతో యువకుడు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో యువకుడు ఆత్మహత్య

Apr 14 2026 7:28 AM | Updated on Apr 14 2026 7:28 AM

వాంకిడి: మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యకు

పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్‌ తెలిపిన వివరాల మేరకు ఇందానికి చెందిన మందాడె సాయినాథ్‌(23) కొంతకాలంగా ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. మృతుని తండ్రి మందాడే సాగర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇంటర్‌ విద్యార్థి ..

ఖానాపూర్‌: ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని సత్తెనపల్లి గ్రామానికి చెందిన భూక్య రాజేశ్వర్‌ కుమారుడు భూక్య ఆకాష్‌ (18) ఖా నాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఇటీవల కంప్యూటర్‌ శిక్షణ కోసం హైదరాబాద్‌కు వెళ్లి ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వాచ్చడు. ఖాళీ సమయంలో డీజే ఆపరేటింగ్‌ చేసే విద్యార్థి అదే రోజు మధ్యాహ్నం డీజే పనికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. సోమవారం ఉదయం గది తలుపు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు కిటికీ ద్వారా చూడగా టవల్‌తో ఉరేసుకుని కనిపించాడు. డీజే వద్ద జరిగిన గొడవలో కొందరు వ్యక్తులు ఆకాష్‌పై దాడి చేసినట్లు తె లిసింది. అలాగే ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురై ఉండవచ్చని భావిస్తున్నా రు. ఈ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని మృతుని తండ్రి రాజేశ్వర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

నర్సాపూర్‌(జి) మండలంలో ..

నర్సాపూర్‌(జి): పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యానని మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గొల్ల మాడకు చెందిన గొల్ల శివాజీ, రజిత కుమారుడు మణివర్ధన్‌(17) నిర్మల్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెందాడు. సోమవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని లొద్దిగుట్ట ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుని తండ్రి శివాజీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement