పుట్టెడు దుఃఖంలో పరీక్షకు.. | - | Sakshi
Sakshi News home page

పుట్టెడు దుఃఖంలో పరీక్షకు..

Apr 14 2026 7:28 AM | Updated on Apr 14 2026 7:28 AM

● తల్లి మృతితో ఒకరు.. తండ్రి మరణంతో మరొకరు.. ● పదోతరగతి పరీక్షకు హాజరైన విద్యార్థులు

శ్రీరాంపూర్‌: ఒక వైపు ఇంట్లో తండ్రి శవం.. మరోవైపు పదోతరగతి పరీక్షలు.. అయినా తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయవద్దనే ఉద్దేశంతో పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుమారుడు పరీక్షకు హాజరై చదువు ప్రాముఖ్యతను చాటిచెప్పాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. శ్రీరాంపూర్‌ ఏరియా కొత్తరోడ్‌కు చెందిన మండల రాజయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. చిన్నకుమారుడు వరుణ్‌ పదోతరగతి పరీక్షలు రాస్తున్నాడు. సోమవారం దుఖఃంలోనే పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొనడం అందరినీ కంటతడి పెట్టించింది.

గిమ్మలో...

సాత్నాల: భోరజ్‌ మండలంలోని గిమ్మ గ్రామానికి చెందిన అర్ధాంగి నీలమ్మ ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది. మృతురాలి కుమారుడు సాయిచరణ్‌కు సోమవారం పదోతరగతి చివరి పరీక్ష ఉంది. ఏంచేయాలో పా లుపోని స్థితిలో ఉన్న సదరు విద్యార్థికి కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పడంతో కన్నీళ్లు తుడుచుకుంటూ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష పూర్తయిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement