సిరికొండ: రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని
ఛిన్నాభిన్నం చేస్తుంది.. ఇంటినుంచి బయటకు వెళ్లిన వ్యక్తి ఇంటికి వచ్చేవరకు ఇంట్లో ఉన్నవారికి టెన్షన్. దీనిని గుర్తించిన సిరికొండ మండలంలోని రాయిగూడ గ్రామస్తులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని, హెల్మెట్ లేకుండా ఊర్లోకి రావద్దని తీర్మానం చేశారు. సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చిన డీజీపీ శివధర్‌రెడ్డికి సర్పంచ్ పెందుర్ లక్ష్మణ్ తీర్మాన ప్రతిని అందజేశాడు.
జామిడిలో...
తాంసి: మండలంలోని జామిడిలో ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతామని, గ్రామానికి వచ్చేవారు హెల్మెట్ ధరించి రావాలని గ్రామస్తులు తీర్మానం చేశారు. సోమవారం మన్నూర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన డీజీపీకి సర్పంచ్ అశోక్ తీర్మాన ప్రతిని అందజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పంచాయతీ ఆధ్వర్యంలో తీర్మానం చేసినట్లు తెలిపారు.


