రక్తదానంతో ప్రాణదాతలుగా నిలుస్తారు | - | Sakshi
Sakshi News home page

రక్తదానంతో ప్రాణదాతలుగా నిలుస్తారు

Apr 14 2026 7:28 AM | Updated on Apr 14 2026 7:28 AM

● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ● యూనియన్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

శ్రీరాంపూర్‌: రక్తదానంతో ప్రాణదాతలుగా నిలుస్తారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి పేర్కొన్నారు. జ్యోతిరావుపూలే, అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఆ యూనియన్‌ ఆధ్వర్యంలో సోమవారం శ్రీరాంపూర్‌ ప్రెస్‌క్లబ్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ కార్మికులు రక్తదానం చేసేందుకు ముందుకురావడం హర్షనీయమన్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో రక్తం అందక, తలసేమియా, సికిల్‌ సెల్‌ వ్యాధితో బాధపడుతున్న వారు రక్తం కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. అలాంటి వారికి అండగా ఉండేందుకు కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ సందర్భంగా 146 యూనిట్లు రక్తనిధిని రెడ్‌ క్రాస్‌ వైద్యులు సేకరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్షుడు గుల్ల బాలాజీ, కార్యదర్శి కస్తూరి చంద్రశేఖర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ వెంగళ శ్రీనివాస్‌, నాయకులు మిడివెల్లి శ్రీణివాస్‌, సాయిల శ్రీనివాస్‌, తోడే సుధాకర్‌, శ్రీపతి బానేశ్‌, పెరక సదానందం, రెడ్‌క్రాస్‌కు చెందిన కాసర్ల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement