ఇంటర్‌లో హవా..! | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో హవా..!

Apr 13 2026 8:20 AM | Updated on Apr 13 2026 8:20 AM

సెకండియర్‌ ఒకేషనల్‌ విభాగంలో రాష్ట్రంలోనే మొదటిస్థానం జనరల్‌లో మూడోస్థానంలో నిలిచిన జిల్లా.. మరోసారి బాలికలదే పైచేయి మెరిసిన కేజీబీవీ, గురుకులాల విద్యార్థులు

ఆసిఫాబాద్‌రూరల్‌: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రస్థాయిలో టాప్‌ 5లో నిలుస్తున్న జిల్లా.. ఈసారీ అదే హవా కొనసాగించింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో సెకండియర్‌ ఒకేషనల్‌ విభాగంలో ఏకంగా రాష్ట్రస్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. సెకండియర్‌ జనరల్‌ విభాగంలో మూడోస్థానంలో నిలవగా, ఫస్టియర్‌ ఫలితాల్లో తొమ్మిదో స్థానం, ఒకేషనల్‌ ఫస్టియర్‌, ప్రైవేట్‌ జనరల్‌, ఒకేషనల్‌ ఫలితాల్లోనూ మూడోస్థానంతో ప్రభంజనం సృష్టించింది.

ఫలితాలు ఇలా..

ఫస్టియర్‌ జనరల్‌ విభాగంలో 4,292 మంది వార్షిక పరీక్షలకు 2,862(66.68శాతం) మంది ఉత్తీర్ణత సా ధించారు. ఇందులో బాలురు 1,990 మందికి 1,049(52.71శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా, 2,302 మంది బాలికలకు పరీక్షలు రాయగా, 1,813(78.76శాతం) మంది పాసయ్యారు. ఒకేషన ల్‌ విభాగంలో 754మంది పరీక్షలకు హాజరు కాగా, 524(69.50శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 345 మంది బాలురకు 198(57.39) మంది, 409 మంది బాలికలకు 326(79.71శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌ జనరల్‌ విభాగంలో 3,745 మందికి 3,077(82.16శాతం) మంది పాసయ్యారు. ఇందులో బాలురు 1,595 మందికి 1,165(73.04) మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 2,150 మందికి 1,912(88.93శాతం) మంది పాసయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో సెకండియర్‌ విద్యార్థులు 654 మంది పరీక్షలు రాయగా, 576(88.07శాతం) మంది పాసయ్యారు. ఇందులో బాలురు 311 మందికి 257(82.64శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే బాలికలు 343 మంది పరీక్షలు రాస్తే 319(93శాతం) మంది పాసయ్యారు. జనరల్‌ విభాగంలో ప్రైవేట్‌ సెకండియర్‌ విద్యార్థులు 270 మంది పరీక్షలకు హాజరు కాగా, 114(42.22శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 183 మందికి 78(42.62) మంది, బాలికలు 87 మందికి 36(41.38) మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్‌ విభాగంలో ప్రైవేట్‌ విద్యార్థులు 34 మందికి 22(64.71) మంది పాసయ్యారు. ఇందులో బాలురు 28 మందికి 18(64.29) మంది ఉత్తీర్ణత సాధించగా, ఆరుగురు బాలికలకు నలుగురు(66.67) ఉత్తీర్ణులయ్యారు.

‘ప్రభుత్వ’ విద్యార్థుల ప్రభంజనం

జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. సెకండియర్‌లో 145 మందికి 137 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో వేదక్షర 960 మార్కులతో టాపర్‌గా నిలిచింది. బైపీసీలో వైష్ణవి 973, సీఈసీలో మాధురి 955 మార్కులు సాధించారు. ఫస్టియర్‌లో 162 మందికి 136 ఉత్తీర్ణత సాధించారు. ఎంఈసీలో శ్రీవర్ష 449/500, బైపీసీలో కీర్తన 422/440, సీఈసీలో ఐశ్వర్య 427/500 మార్కులతో మెరిశారు. మోడల్‌ స్కూల్‌కు చెందిన ఐ.వైష్ణవి ఎంఈసీ సెకండియర్‌లో 883 మార్కులు, మాధవి సీఈసీ ఫస్టియర్‌లో 955 మార్కులు సాధించారు. మహాత్మా జ్యోతిబా పూలే ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరంలో ఎంపీసీ గ్రూపునకు చెందిన 28 మందికి 27 మంది పాసయ్యారు. జశ్వంత్‌ 466/470 టాప్‌లో ఉన్నాడు. బైపీసీలో 25 మందికి 23 మంది ఉత్తీర్ణులు కాగా, ఉమిద్‌ 423/440 మార్కులు సాధించారు. సెకండియర్‌ ఎంపీసీలో 20 మందికి 20 మంది ఉత్తీర్ణులు కాగా, సిద్దార్థ 970/1000, బైపీసీలో 12 మందికి 12 ఉత్తీర్ణులు కాగా, మధుకర్‌ 947/1000 మార్కులు సాధించాడు. మైనార్టీ బాలికల గురుకుల కళాశాలలో 63 మంది 62 ఉత్తీర్ణులు కాగా, హెచ్‌ఈసీ, సీఈసీ, ఎంఈసీలో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. సీఈసీలో కళ్యాణి 484/500, అస్రానైజ్‌ 954/1000 మార్కులు సాధించారు. బాలికల గురుకుల కళాశాలలో సెకండియర్‌లో 156 మంది 156 మంది, ఫస్టియర్‌లో 142 మందికి 128 మంది ఉత్తీర్ణులయ్యారు. పీటీజీ బాలురు గురుకుల కళాశాలలో సెకండియర్‌ విద్యార్థులు 56 మందికి 55 మంది, ఫస్టియిర్‌లో 74 మందికి 65 మంది పాసయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో సెకండియర్‌లో ఎంపీసీ, బైపీసీలో 57 మందికి 50 మంది పాసయ్యారు. ఫస్టియిర్‌లో 69 మందికి 64 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆసిఫాబాద్‌ కేజీబీవీకి చెందిన హారిక ఎంపీసీ ఫస్టియర్‌లో 445, బైపీసీ సెకండియర్‌లో స్వాతి 956 మార్కులు సాధించారు.

ఆరేళ్లుగా ఫలితాలు

విద్యాసంవత్సరం హాజరు ఉత్తీర్ణులు శాతం రాష్ట్రస్థాయిలో స్థానం

2019– 20 ఫస్టియర్‌ 3,856 2,739 71 02

సెకండియర్‌ 3,078 2,487 80 01

2020– 21 ఫస్టియర్‌ 5,252 3,716 70 03

సెకండియర్‌ 4,826 3,678 76 02

2021– 22 ఫస్టియర్‌ 5,137 3,748 74 03

సెకండియర్‌ 4,697 3,793 81 02

2022– 23 ఫస్టియర్‌ 5,137 3,748 74 03

సెకండియర్‌ 4,697 3,798 81 02

2023– 24 ఫస్టియర్‌ 4,570 2,813 61 08

సెకండియర్‌ 4,095 2,951 81 07

2024– 25 ఫస్టియర్‌ 4,756 3,349 74 04

సెకండియర్‌ 4,920 3,948 84 02

2025– 26 ఫస్టియర్‌ 4,292 2,862 66.68 09

సెకండియర్‌ 3,745 3,077 82.16 03

అదరగొట్టిన అమ్మాయిలు..

ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ఫస్టియర్‌లో జనరల్‌, ఒకేషనల్‌ విభాగాల్లో కలిపి 2,335 మంది బాలురు పరీక్షలు రాయగా 1,247 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 2,711 మందికి 2,139 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 1,906 మంది బాలురకు 1422 మంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 2,493 మందికి 2,231 మంది పాసయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement