అదుపు తప్పితే అంతే.. | - | Sakshi
Sakshi News home page

అదుపు తప్పితే అంతే..

Apr 13 2026 8:20 AM | Updated on Apr 13 2026 8:20 AM

టీఎస్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని ఆదిత్య నర్సింగ్‌హోంలో ఆదివారం టీఎస్‌ యూటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, యువత హాజరై రక్తదానం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్‌ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు ప్రాణ దానం చేసే శక్తి రక్తదానానికే ఉందన్నారు. ఆరోగ్యవంతులు మూడు, నాలుగు నెలలకు ఒక్కసారి రక్తదానం చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానా మాట్లాడుతూ సమాజంలో మానవతా విలువలను పెంపొందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడుతాయన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రసాంశాపత్రాలు అందించారు. కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి, ప్రధాన కార్యదర్శి ఊషన్న, వైద్యులు రావుజీ, సునీత, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీదేవి, ఎంఈవో ప్రభాకర్‌, చరణ్‌దాస్‌, సత్యనారాయణ, మధుకర్‌, రాజ్‌కమలాకర్‌రెడ్డి, మహిపాల్‌, దుర్గయ్య, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement