సత్తా చాటిన కేజీబీవీ బాలికలు | - | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన కేజీబీవీ బాలికలు

Apr 13 2026 8:20 AM | Updated on Apr 13 2026 8:20 AM

జి.గంగారాణి,

ఎంపీసీ(978)

డి. వైష్ణవి, ఎంపీసీ(456)

కాగజ్‌నగర్‌టౌన్‌: ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో కస్తూరిబా గాంధీ విద్యాలయాలకు చెందిన బాలికలు సత్తా చాటారు. పలు కాలేజీలు వందశాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. దహెగాం కేజీబీవీలో ద్వితీయ సంవత్సరంలో 38 మంది విద్యార్థినులకు 38 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 35 మందికి 33 మంది పాసయ్యారు. తిర్యాణి కేజీబీవీలో సెంకడియర్‌ విద్యార్థినులు 24 మందికి అందరూ ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 36 విద్యార్థినులకు 34 మంది ఉత్తీర్ణత సాధించారు. లింగాపూర్‌ కస్తూరిబాలో ఈ విద్యాసంవత్సరమే తరగతులు ప్రారంభం కాగా, 15 మందికి 15 మంది పాసయ్యారు. ఇక కెరమెరి మండలంలోని మోడి కేజీబీవీలో ఫస్టియర్‌ విద్యార్థులు 43 మందికి 40 మంది, సెకండియర్‌లో 57 మందికి 55 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆసిఫాబాద్‌ కేజీబీవీలో సెకండియర్‌ బైపీసీ, హెచ్‌ఈసీలో 59 మంది 59 మంది ఉత్తీర్ణత సాధించారు. బైపీసీలో స్వాతి 956, ఎంపీసీ లో శైలజ 903 మార్కులు సాధించారు. ఫస్టియర్‌లో 77 మందికి 72 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో అకాంక్ష 465/470, బైపీసీలో అక్షయ 415/440 మార్కులు సాధించారు.

టాపర్‌గా గంగారాణి

కాగజ్‌నగర్‌ పట్టణం ఆర్‌ఆర్‌వో కాలనీలోని కేజీబీవీ బాలికలు జిల్లా టాపర్‌లుగా నిలిచారు. ఎంపీసీ సెకండియర్‌లో జి.గంగారాణి 978/1000 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. ఎంపీసీలో జి.శ్వేత 962/1000, డి.వైష్ణవి, 456/470 మార్కులు సాధించారు. కాగజ్‌నగర్‌ మండలం అంకుశాపూర్‌ గ్రామానికి చెందిన వనజా– శ్రీనివాస్‌ దంపతుల కుమార్తె గంగారాణి కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. గంగారాణి ఐదో తరగతి నుంచి కేజీబీవీలోనే చదువుతోంది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను ఎస్‌వో రమాదేవి, ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement