కెరమెరి: పంచాయతీలో జరిగే ప్రతీ ఆడబిడ్డ పెళ్లికి రూ.10 వేల ఆర్థికసాయం అందిస్తానని మాటిచ్చిన ఆ సర్పంచ్ తన హామీ నిలబెట్టుకున్నారు. జైనూర్ మండలం జామ్నికి చెందిన ధుర్వ గిరిజాబాయికి కెరమెరి మండలం ఆగుర్‌వాడ గ్రామానికి చెందిన బల్లార్‌శావ్‌తో ఆదివారం ఆగుర్‌వాడలో వివాహం జరిగింది. ఆడబిడ్డకు పెళ్లికానుక అందించాలని భావించిన జామ్ని సర్పంచ్ సోంబాయి నాగోరావు, ఉపసర్పంచ్ కళ్యాణి సమాధాన్ డోంగ్రే నవ వధువుకు మండపంలోనే రూ.10 వేల ఆర్థికసాయం అందించారు. ఇప్పటివరకు ఐదుగురికి రూ.10వేలు చొప్పున రూ.50 వేలు అందించారు. కార్యక్రమంలో టేకం నాగుబాయి, కొడొప బాది, ఆత్రం రాజు, మడావి దేవ్‌రావు తదతరులు పాల్గొన్నారు.


