ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు విక్రయించరాదు | - | Sakshi
Sakshi News home page

ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు విక్రయించరాదు

Apr 12 2026 3:48 AM | Updated on Apr 12 2026 3:48 AM

ఆసిఫాబాద్‌: ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు విక్రయించరాదని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అశ్విని అ న్నారు. శనివారం జిల్లాలోని ఫార్మసిస్ట్‌లు, మె డికల్‌ షాపుల యజమానులు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎం గార్డెన్‌లో డీఎంహెచ్‌వో సీతారాం, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, ఈ గల్‌ టీం సభ్యుడు రమేశ్‌తో కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవగాహన కల్పించా రు. ఈ సందర్భంగా డ్రగ్‌ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌, గంజాయి, కల్తీ కల్లు వంటి నిషే దిత పదార్థాలపై నియంత్రణ అవసరమన్నా రు. ప్రజారోగ్యం దృష్ట్యా మెడికల్‌ షాపుల యజమానులు నిబంధనలు పాటించాలన్నా రు. అనంతరం నార్కోటిక్స్‌, నిషేధిత ఔషధాలు విక్రయించమని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలోని పాఠశాలల్లో నిర్వహించిన డ్రగ్స్‌ కంట్రోల్‌ క్విజ్‌, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement