సమ్మెలో సిబ్బంది.. సేవలకు ఇబ్బంది! | - | Sakshi
Sakshi News home page

సమ్మెలో సిబ్బంది.. సేవలకు ఇబ్బంది!

Apr 12 2026 3:48 AM | Updated on Apr 12 2026 3:48 AM

విద్యార్హత ఆధారంగా ఆర్టిజన్స్‌ ఉద్యోగులను కన్వర్షన్‌ చేయాలి.

ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలి

అన్‌మ్యాన్డ్‌ వర్కర్లను ఆర్టిజన్లలో విలీనం చేయాలి.

2016 డిసెంబర్‌ 4కు ముందు నుంచి ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్లుగా గుర్తించాలి.

పీస్‌ రేట్‌ కార్మికులకు జీవో 3 ప్రకారం కనీ స వేతనం చెల్లించాలి.

2026 పీఆర్‌సీ(వేతన సవరణ)అమలు చేయాలి.

కొనసాగుతున్న ఆర్టిజన్స్‌ కార్మికుల నిరసనలు ఏళ్లుగా అపరిష్కృత సమస్యలు మొరపెట్టుకున్నా వినిపించుకోని ప్రభుత్వం సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తగ్గేదేలే.. విద్యుత్‌ సేవలకు అంతరాయం

చిత్రంలో కనిపిస్తున్న యువకుడు పులి రితేష్‌. తిర్యాని మండలంలో అన్‌మ్యాన్డ్‌ కార్మికునికిగా విధులు నిర్వహిస్తున్నాడు. 2018లో ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా షాక్‌కు గురికావడంతో ఒకచేయి పూర్తిగా కోల్పోగా రెండో చేయి పనిచేయకుండా అయ్యింది. వైద్యచికిత్సల నిమిత్తం సుమారు రూ.18 లక్షలు ఖర్చు చేశాడు. మూడేళ్లు మంచంపైనే ఉన్నాడు. విద్యుత్‌శాఖ అధికారులు బాధితుడికి ఇప్పటి వరకు నయాపైసా ఆర్థికసాయం అందించలేదు. ఇలాంటి అచేతనావస్థలో ఉన్న విద్యుత్‌ కార్మికులు జిల్లాలో మరెందరో ఉన్నారు. కార్మికుల డిమాండ్లు నెరవేరిస్తే సమస్యలు తీరే అవకాశం ఉంది.

సమ్మె కొనసాగిస్తాం

విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్స్‌, అన్‌మ్యాన్డ్‌, పీస్‌రేట్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేరర్స్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తాం. ఏపీఏసీబీ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలి. విద్యార్హతలను బట్టి కన్వర్షన్‌ చేయాలి. ప్రభుత్వం స్పందించాలి.

– ఆత్రం మారుతి, ఆర్టిజన్‌ జేఏసీ జిల్లా చైర్మన్‌

ప్రభుత్వం చేతిలో ఉంది

వినియోగదారులకు విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తున్నాం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. జిల్లాలో ఉన్న ఎల్‌ఐ, ఎల్‌ఎం, జేఎల్‌ఎంలకు బాధ్యతలు అప్పగించాం. కార్మికుల సమస్యల పరిష్కారం ప్రభుత్వం చేతిలో ఉంది.

– ఉత్తమ్‌ జాడే, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ, ఆసిఫాబాద్‌

కెరమెరి: విద్యుత్‌ సంస్థలో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ వినియోగదారులకు సేవలందిస్తున్న పలు కేటగిరీ ల కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం ఆర్టిజన్లుగా గుర్తించింది. రెగ్యులర్‌ పేస్కేల్‌, పే స్లి ప్‌, ఆర్జిత సెలవులు వంటి లబ్ధి కల్పించి వీరిని ప్ర త్యేక కేటగిరీగా పరిగణిస్తున్నారు. దీంతో రెగ్యులర్‌ ఉద్యోగులతో పోలిస్తే జీతభత్యాల్లో భారీ వ్యత్యా సం ఉంది. ఈ నేపథ్యంలో తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని విద్యుత్‌ శాఖలోని వివిద విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు జిల్లా కేంద్రంలో ఈ నెల 8 నుంచి సమ్మె బాట పట్టారు.

జేఏసీగా ఏర్పడి..

గతంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో కార్మికులు తెలంగాణ విద్యుత్‌ జేఏసీగా ఏర్పడ్డారు. తొలుత సంతకాల సే కరణ చేపట్టారు. మార్చిలో హైదరాబాద్‌లోని ప్రధా న కార్యాలయం ఎదుట, 26, 30 తేదీల్లో డివిజన్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏప్రిల్‌ 2న సర్కిల్‌ కార్యాలయం, 4న కేటీపీ(కాకతీయ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం) ఎదుట, 7న ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. అయినా అధికారుల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో ఈ నెల 8 నుంచి నిరవధిక సమ్మెలోకి దిగారు.

శ్రమ దోపిడీ

జిల్లాలో 33/11 కేవీ సబ్‌ స్టేషన్లు 34 ఉన్నాయి. వాటిలో ఇంటి కనెక్షన్లు 1,41,933, వ్యవసాయ కనెక్షన్లు 15,337, వ్యాపార కనెక్షన్లు 15,190, పరిశ్రమలు 630, చిరుపరిశ్రమలు 11, హైటెన్షన్‌ కనెక్షన్లు 104, ఇతర కనెక్షన్లు 5,720 ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 2017 జూలై 29న సబ్‌స్టేషన్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు, పలు విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులను 1947–12/3 చట్టం ప్రకారం ప్రభుత్వంలో విలీనం చేసింది. దీంతో ఆరుగురు చేయాల్సిన పనిని ఒకరిద్దరితో చేయిస్తూ శ్రమదోపిడీకి పాల్పడుతున్నారు. స్టాండింగ్‌ ఆర్డర్స్‌ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం వీక్లీఆఫ్‌, ఓవర్‌ డ్యూటీ జీతభత్యాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇవ్వడం లేదు.

జిల్లాలో కార్మికుల వివరాలు

కార్మికులు సంఖ్య

ఆర్టిజన్స్‌(ట్రాన్క్‌) : 22

ఆర్టిజన్స్‌(ఎన్‌పీడీసీఎల్‌) : 90

అన్‌మ్యాన్డ్‌ : 66

పీస్‌రేట్‌ : 12

ట్రాన్స్‌ఫార్మర్‌ రిపేరర్లు : 18

డిమాండ్లు..

Advertisement
 
Advertisement
Advertisement