బడుగుల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే | - | Sakshi
Sakshi News home page

బడుగుల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే

Apr 12 2026 3:48 AM | Updated on Apr 12 2026 3:48 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే అని డీపీవో భిక్షపతిగౌడ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల కోసం, మహిళల విద్యాభ్యాసంకోసం పూలే విశిష్ట సేవలు అందించారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అకాష్‌, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాం నాయక్‌, తదితరులు పాల్గొన్నారు. మాలీ సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ ఎక్స్‌రోడ్డులోని మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, గ్రంథాలయంలో వేడుకలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement