రెబ్బెన: కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ నిర్లక్ష్య పు ధోరణి ప్రదర్శిస్తోందని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏ రియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు అన్నా రు. శనివారం బెల్లంపల్లి ఏరియా లోని ఏరియా వర్క్‌షాప్‌లో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సింగరేణి కార్మికులకు ఉన్న హక్కులు కేవలం కేసీఆర్ నాయకత్వంలో టీబీజీకేఎస్ సాధించినవేనన్నారు. ప్రస్తు తం అధికారంలో ఉన్న కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్‌టీయూసీ కార్మికులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందన్నారు. రానున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు టీ బీజీకేఎస్‌ను అక్కున చేర్చుకుని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మంగీ లాల్, ఏరియా నాయకులు మారిన వెంకటేశ్వర్లు, పిట్ కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు సురేష్, గణ పతి, రమేశ్, వైకుంఠం, తదితరులు పాల్గొన్నారు.


