యోగాతో సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

Apr 11 2026 8:28 AM | Updated on Apr 11 2026 8:28 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: యోగా సాధన చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా జయించవచ్చని కలెక్టర్‌ కె.హరిత సూ చించారు. శుక్రవారం ‘యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌–వన్‌ హెల్త్‌’ నినాదంతో కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులతో కలిసి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి వేగవంతమైన జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనా రోగ్య సమస్యలకు యోగా ఒక సమగ్ర పరిష్కారమ ని పేర్కొన్నారు. యోగా వ్యాయామ పద్ధతి మాత్ర మే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానమని తె లిపారు. ప్రతీరోజు యోగాసనాలు వేయడం ద్వారా శరీరానికి దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. రోగ నిరోధక శక్తి పెరగడమే కా కుండా జీవన ప్రమాణాలు మెరుగుపడతా యని తెలిపారు. మానసిక ప్రశాంతత లభించడం ద్వారా వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబం, సమాజం మొత్తానికి సానుకూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. జిల్లాలో యోగాపై అవగాహన కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని చిన్న వయ స్సు నుంచే యోగా అలవాటు చేయడం అత్యంత అ వసరమని సూచించారు. యోగా సాధన ద్వారా వి ద్యార్థుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, మానసిక స్థిరత్వం పెరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ని ప్రతీ పాఠశాలలో ఉదయం యోగా తరగతులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. యోగా శిక్షకుడు అశోక్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రా వ్‌, డీఆర్డీవో దత్తారావ్‌, వైద్యులు, ఇతర శాఖల జి ల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement