పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

Apr 11 2026 8:28 AM | Updated on Apr 11 2026 8:28 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ దివ్య సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులు, ఎంపీడీవోలు, డీపీవోలు, ఏపీవోలతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాల సంక్షేమానికి అమలు చేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన పథకం పెన్షన్‌ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయాలని సూ చించారు. గతంలో ఈ కార్యక్రమం తహసీల్దార్‌ల బాధ్యతలో ఉండేదని, నూతన జీవో 172 ప్రకారం బాధ్యతలు ఎంపీడీవోలకు బదలాయించినట్లు తెలి పారు. అర్హత గల అభ్యర్థులు మీసేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ దరఖాస్తులు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల పరిధిలోకి వెళ్తాయని, తమ పరిధిలోని కార్యదర్శుల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి పంపిస్తారని తెలిపారు. సదరు అధి కారి నుంచి ప్రభుత్వ లాగిన్‌కు వెళ్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీవో దత్తారావ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పథకాన్ని సంబంధిత అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహిస్తామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement