ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో రహదారి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.హరిత సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థా యి రహదారి భద్రత కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న గ్రామాల్లో నేషనల్ హైవే అధికారులు లైటింగ్ ఏర్పాటు చేయాలని, సర్వీస్ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు, సైడ్ డ్రైన్‌లు నిర్మించాలని, పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. రహదా రులకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, వేలాడే తీగలను సరి చేయాలని, రహదారికి ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలకు రేడియం స్టిక్కర్లు అంటించాలని పేర్కొన్నారు. వాహనాలు, స్కూల్ బస్సుల ను తనిఖీ చేయాలని తెలిపారు. రహదారులకు మ రమ్మతు, వంతెనల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడైనా ప్రమాదం జరి గితే వెంటనే క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మున్సి పాలిటీలు, మండల కేంద్రాల్లో వాహనాల రద్దీ లేకుండా చూడాలని, మద్యం తాగి, హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రహదారి నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పని చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్పీ నితికా పంత్, అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా, డీఆర్డీవో దత్తారావ్, రవాణాశాఖ అధికారి రాంచందర్, డీపీవో భిక్షపతి, ఎస్‌ఈ ఉత్తమ్‌జాడె, పీఆర్ ఈఈ ధర్మేందర్, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.


