కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూరు పేపరు మిల్లు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ఎస్పీఎం మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు మల్లికా ర్జున్ డిమాండ్ చేశారు. శుక్రవారం కాగజ్‌నగర్ ప ట్టణంలోని సీనియర్ సిటిజన్స్ భవనంలో మిల్ కా ర్మికుల జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మల్లి కార్జున్ మాట్లాడా రు. రాష్ట్రంలో అనేక పరిశ్రమల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నా సిర్పూరు పేపరు మిల్లు యాజమాన్యం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్‌ను అడ్డుపెట్టుకుని అడ్డు పడుతోందని ఆరోపించారు. కార్మికులకు వేతన ఒప్పందం సజావుగా జరగాలంటే గుర్తింపు కార్మిక సంఘంతోనే సాధ్యమవుతుందని తెలిపారు. మిల్లు యాజమాన్యం ఎగవేత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. పరి శ్రమ తెరిచి ఎనిమిదేళ్లయినా పూర్తి స్థాయిలో ఉత్పత్తి వస్తున్నా కార్మికులకు సౌకర్యాలు కల్పించడంలో మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ఎన్నికలు నిర్వహించేందుకు సీఐటీయూ కృషి చేస్తుందని చెప్పారు. యూనియన్ జనరల్ సెక్రటరీ కూశన రాజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపాల్, ఉపాధ్యక్షుడు ముంజం శ్రీనివాస్, మహ్మద్‌షబ్బీర్, వెంకటేశం, సహాయ కార్యదర్శులు మహేశ్, రాజేందర్, రామ్, రాజన్న, రమేశ్, త్రివేణి, రాజేందర్ పాల్గొన్నారు.


