సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ చేయాలి

Apr 11 2026 8:28 AM | Updated on Apr 11 2026 8:28 AM

ఆసిఫాబాద్‌రూరల్‌: రెబ్బెన పీహెచ్‌సీని సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ చేయాలని కోరుతూ శుక్రవా రం ఏఐటీయూసీ అధ్వర్యంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌కు కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి ఉపేందర్‌ మాట్లాడుతూ.. రెబ్బెన మండలంలోని 24 గ్రామపంచా యతీలతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజ లు లక్ష మంది వరకు రెబ్బెన పీహెచ్‌సీపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. పీహెచ్‌సీలో అత్యవసర సేవలు అందుబాటులో లేక బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ ప్రాంతాలతోపాటు ప్రైవేట్‌ ఆస్పత్రులకు పోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఐపీహెచ్‌ఎస్‌ నిబంధనల ప్రకారం వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లో 50వేల జనాభాకు ఒక సీహెచ్‌సీ ఉండాలని తెలిపారు. ఇందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు చొరవ తీసుకోివాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చిరంజీవి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement