దండేపల్లి: మండలంలోని మేదరిపేటలో గల ఓ వైన్స్ దుకాణంలో కల్తీ బీర్లు వచ్చాయని మామిడిపల్లికి చెందిన శ్రీనివాస్, మధుకర్ ఆరోపించారు. మేదరిపేటలోని 36వ నెంబర్ వైన్స్ దుకాణంలో శుక్రవారం 5 బీర్లు కొనుగోలు చేశామని, అందులో 2 బీర్లు కల్తీ వచ్చాయని, వాటిని ఓపెన్ చేస్తే చెడు వాసన వచ్చిందన్నారు. విషయాన్ని షాప్ నిర్వాహకులకు తెలియజేస్తే, ‘అక్కడి నుండే వచ్చాయ్.. దానికి మేమేం చేస్తాం..’ అంటూ పొంతనలేని సమాధానం ఇచ్చారన్నారు. దీంతో విషయాన్ని లక్సెట్టిపేట ఎకై ్సజ్ సీఐ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ విషయమై లక్సెట్టిపేట ఎకై ్సజ్ సీఐ సమ్మయ్యను ఫోన్లో సంప్రదించగా, కల్తీ జరిగిందని కొందరు నాకు ఫోన్ చేశారని, దీనిపై విచారణ జరిపిస్తామన్నారు.


