నిర్మల్ జిల్లాలోని వివిధ మండలాల్లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పలువురు రైతులకు చెందిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. భైంసారూరల్ మండలంలోని కామోల్‌లో మూడెకరాలు, కుంటాల మండలంలోని లింబా(కె)లో రెండెకరాలు, తానూరు మండలంలోని దాగాంలో రెండెకరాలు, నర్సాపూర్(జి) మండలంలోని టెంబరేణిలో ఎనిమిదెకరాల్లో పంట అగ్నికి ఆహుతైంది.
భైంసారూరల్: మండలంలోని కుంసర శివారులో శుక్రవారం కామోల్ గ్రామానికి చెందిన కౌలు రైతు మల్లేశ్‌కు చెందిన మూడెకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న బాధిత రైతు పంట పొలానికి వెళ్లి చూడగా పంట పూర్తిగా కాలిబూడిదైంది. గుర్తు తెలియని దుండగులు పంటకు నిప్పు పెట్టినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పరిహారం అందించాలని బాధిత రైతు కోరుతున్నాడు.
లింబా(కె)లో...
కుంటాల: మండలంలోని లింబా(కె) గ్రామంలో బుసాపూర్ రాజేశ్వర్‌రెడ్డి రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. చేనుపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగల నుంచి నిప్పురవ్వలు పడడంతో నిప్పంటుకుని పంటచేను దగ్ధమైంది. దాదానె రూ.లక్ష నష్టం జరిగిందని, ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.
దాగాంలో...
తానూరు: మండలంలోని దాగాంలో రైతు జాదవ్ సుధాకర్ పటేల్ తనకున్న రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. వారం రోజుల క్రితం పంటను కోసి చేనులోనే ఉంచాడు. శుక్రవారం ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విదు్‌య్‌త్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగడంతో పంటకు నిప్పంటుకుని సుమారు 50 క్వింటాళ్ల మొక్కజొన్న దగ్ధమైంది. సుమారు రూ.1.20 లక్షల నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయాడు. వ్యవసాయ విస్తీర్ణ అధికారి సిరాజ్ ఘటన స్థలానికి చేరుకుని దగ్ధమైన పంటను పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు.
టెంబరేణిలో...
నర్సాపూర్(జి): మండలంలోని టెంబరేణిలో రైతులు నిమ్మల శ్రీధర్‌రెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌రెడ్డి, మెంచు భార్గవ్ సుమారు 8 ఎకరాల్లో మొక్కజొన్నను కో సి నూర్పిడికి సిద్ధంగా ఉంచారు. ఈ క్రమంలో వి ద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పంట పూర్తిగా దగ్ధమైంది. ప్రశాంత్ అనే రైతు విత్తనం కోసం నిల్వ ఉంచిన పసుపు అగ్నికి ఆహుతైంది. రైతులు కష్టపడి పండించిన పంట దగ్ధం కావడంతో కన్నీరు ము న్నీరవుతున్నారు. ప్రభుత్వం పరిహారం అందించా లని ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.


