ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ

Apr 11 2026 8:22 AM | Updated on Apr 11 2026 8:22 AM

లక్ష్మణచాంద: రోడ్డుపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఒకరికి గాయాలైన సంఘటన సోన్‌ మండలంలో ని కడ్తాల్‌ గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఉత్తరప్రదేశ్‌ నుంచి బెంగళూర్‌ బయలుదేరిన లారీ శుక్రవారం తెల్లవారుజామున కడ్తాల్‌ శివారులో ఎన్‌హెచ్‌ 44పై ఆగి ఉంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌ నుంచి బెంగళూర్‌ వైపు వెళ్తున్న మరోలారీ నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో క్లీనర్‌ ప్రదీప్‌కుమార్‌ త్రిపాఠికి తీవ్రగాయాలు కావడంతో నిర్మల్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనలో నిలిపిన లారీ ధ్వంసం కావడంతో డ్రైవర్‌ వికాస్‌ సాకేత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢీకొట్టిన డ్రైవర్‌ మానస్‌ త్రిపాఠిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సోన్‌ ఎస్సై గోపి తెలిపారు.

దంపతులపై కేసు

నెన్నెల: మండలంలోని నార్వాయిపేటకు చెంది న దంపతులు కున్సోతు రమేశ్‌, రజితపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ఆలి తెలిపారు. మేకల విషయంలో కున్సోతు అర్చనతో జరిగిన గొడవలో దంపతులు ఆమెను దూషించడంతో పాటు కొట్టారని సదరు మ హిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సి దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్సై వివరించారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

నర్సాపూర్‌(జి): మండలంలోని అర్లి(కె) ఎక్స్‌రోడ్‌ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. తురాటి గ్రామానికి చెందిన ప్రసాద్‌ పనినిమిత్తం బైక్‌పై భైంసా వైపు వెళ్తుండగా అర్లి(కె) ఎక్స్‌రోడ్డు వద్దకు రాగానే కుక్క అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. కుడికాలు విరగడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

విద్యుత్‌ వైరు చోరీ

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలోని పాత హౌసింగ్‌ బోర్డు కాలనీలో కై లాస్‌ సింగ్‌ ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. హౌస్‌ వైరింగ్‌ కోసం 41 బండిళ్లను తెప్పించగా గుర్తు తెలియని దుండగులు శుక్రవారం తెల్లవారుజామున వాటిని ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement