ఉట్నూర్‌రూరల్:ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో పనుల పు రోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో చే పట్టిన అభివృద్ధి పనులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. ఆరోగ్యం, గిరిజన సహకార సంస్థ, ఇంజినీరింగ్, విద్య, గురుకులాలు, మహిళా, శి శు సంక్షేమం, ఉద్యానవన, వ్యవసాయ, గ్రామీణ నీ టి సరఫరా, భూ వివాదాలు, అటవీ హక్కుల చ ట్టం, తదితర విభాగాల అధికారులు తమకు కేటా యించిన పనులను నిర్ణీత గడువులోగా చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు తమ శాఖల ప్రగతిని వివరించారు.


