అర్హులందరికీ సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Apr 3 2026 7:14 AM | Updated on Apr 3 2026 7:14 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: మున్సిపాలిటీ పరిధిలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తెలిపారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వార్డు నం.1లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. వార్డు నం.1లో పది మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, అర్హులను గుర్తించి మరిన్ని ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. యూఐడీఎఫ్‌ నిధులతో సీసీరోడ్డు, డ్రెయినేజీ పనులు చేపడతామన్నారు. అలాగే డాడానగర్‌ చౌరస్తా నుంచి వివేకానంద సెంటర్‌ వరకు సీసీరోడ్డు వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, ఏడీఏ మనోహర్‌, ఏపీవో గౌరవీ శంకర్‌, కౌన్సిలర్లు అలియా బేగం, జ్యోతి, తాజ్‌ పాల్గొన్నారు. అనంతరం బారెగూడ పంచాయతీలోని శివపూర్‌ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి రూ.30లక్షలతో సీసీ రోడ్డు, డ్రెయినేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement