దహెగాం: మండలంలోని కర్జి గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువు పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.87 కోట్లు మంజూరు చేసింది. 2021లో భారీ వర్షాలకు చెరువులోకి వరద పోటెత్తడంతో మత్తడి పూర్తిగా కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఏటా వర్షాకాలంలో నీరంతా వృథాగా పోతోంది. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో నీటి పారుద ల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కర్జి చెరు వు పునరుద్ధరణకు నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే పాల్యాయి హరీశ్‌బాబు తెలిపారు. త్వరలో టెండర్లు పిలిచి మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు. సుమారు 600 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. నిధులు విడుదల కావడంపై ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
6,925 మంది హాజరు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో గురువారం ని ర్వహించిన పదో తరగతి భౌతికశాస్త్రం పరీ క్షకు 6,950 మంది విద్యార్థులకు 6,925 మంది హాజరుకాగా, 25 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 225 మందికి 205 మంది పరీక్ష రాశారని జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్ తెలిపారు. పలు పరీక్ష కేంద్రాలను డీఈవో లలిత సందర్శించారు.


