ఆసిఫాబాద్: జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డే అనిల్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో చైర్మన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధి, పాఠకులకు వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. విద్యార్థులు, యువతకు ఉపయోగపడే పుస్తకాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఎమ్మెల్సీ దండె విఠల్, ఏఎంసీ చైర్‌పర్సన్ ఇరుకుల్ల మంగ, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, సిబ్బంది ఆయనను అభినందించారు. అంతకు ముందు వేద పండితులు మహేశ్, శేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ భాగ్యలక్ష్మి, నాయకులు గాదెవేణి మల్లేశ్, తారీక్, జావిద్, శైలేందర్, సిబ్బంది పాల్గొన్నారు.


