ఆది దంపతుల కల్యాణం | - | Sakshi
Sakshi News home page

ఆది దంపతుల కల్యాణం

Apr 3 2026 7:14 AM | Updated on Apr 3 2026 7:14 AM

కల్యాణోత్సవం నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

రెబ్బెన మండలం ఇందిరానగర్‌లోని స్వయంభూ మహంకాళి ఆలయంలో చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం జాతర మహోత్సవం ప్రారంభమైంది. తొలిరోజు ఆది దంపతులైన శివపార్వతుల కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు దేవార వినోద్‌ దంపతులు కల్యాణంలో కూర్చుకున్నారు. టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, కంకణాలు తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దారావత్‌ అరుణకృష్ణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు తిరుపతిగౌడ్‌, సభ్యులు పాల్గొన్నారు. కాగా, జాతరలో భాగంగా శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన బోనాల జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. – రెబ్బెన

ఉత్సవ విగ్రహాలతో నిర్వాహకులు

తలంబ్రాలు సిద్ధం చేస్తున్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement