ఆస్పత్రి భవన నిర్మాణ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి భవన నిర్మాణ పనుల పరిశీలన

Apr 5 2026 7:42 AM | Updated on Apr 5 2026 7:42 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: పట్టణంలోని ఎల్లగౌడ్‌తోట సమీ పంలో చేపట్టిన వంద పడకల ఏరియాస్పత్రి భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని సైట్‌ ఇంజినీర్‌కు సూచించారు. అనంతరం ఆస్పత్రిలో ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పెంచికల్‌పేట్‌ మండలం ఎల్లూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థులను పరామర్శించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలని వైద్యులకు సూచించారు. వీరి వెంట సూపరింటెండెంట్‌ అవినాష్‌, వైద్యులు విజయ్‌, మహేశ్‌, అరుణ్‌, డయాలసిస్‌ టెక్నీషియన్‌ శివ, ఆయుష్మాన్‌ భారత్‌ ఇన్‌చార్జి సందీప్‌, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement