పాముల్‌వాడలో ‘ప్రజాబాట’ | - | Sakshi
Sakshi News home page

పాముల్‌వాడలో ‘ప్రజాబాట’

Apr 5 2026 7:42 AM | Updated on Apr 5 2026 7:42 AM

లింగాపూర్‌: సిర్పూర్‌(యూ) మండలంలోని పాముల్‌వాడ గ్రామంలో శనివారం ‘ప్రజా బాట‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆసిఫాబాద్‌ ఆపరేషన్‌ సర్కిల్‌ సూ పరింటెండెంట్‌ ఇంజినీరింగ్‌ జాడే ఉత్తమ్‌ మాట్లాడారు. విద్యుత్‌శాఖ తరఫున లూజ్‌లై న్లు, వంగిన స్తంభాలు, తక్కువ స్థాయిలో ఉ న్న ట్రాన్స్‌ఫార్మర్లను సరిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వివిధ గ్రామాల్లో ఇప్పటికే బావులు, బోర్లకు కొత్త విద్యుత్‌ కనెక్షన్లు అవసరమని తెలిపారు. నిబంధనల ప్రకారం నూ తన కనెక్షన్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వ న్యప్రాణుల వేటకు విద్యుత్‌ తీగలతో ఉచ్చులు అమర్చితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏడీ శ్రీనివాస్‌, ఏఈ కలీల్‌ అహ్మద్‌, లైన్‌ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement