తిర్యాణి: అసాంఘిక కార్యకలాపాలపై కఠి నంగా వ్యవహరించాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. శనివారం మండల కేంద్రంలో ని పోలీస్‌స్టేషన్ ఆమె ఆకస్మీకంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా రికార్డులు, హాజరు రిజి ష్టర్లు పరిశీలించారు. కేసుల పురోగతి వివరా లను ఎస్సై వెంకటేశ్‌ను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో చట్ట వ్య తిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మా దక ద్రవ్యాలపై దృష్టి సారించాలని తెలి పా రు. వ్యాపారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చే సుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యహరించాలని పేర్కొన్నారు. మహిళలు, బాలికలకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.


