ఆసిఫాబాద్‌అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రా ష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్ రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని, తహసీల్దా ర్లు, సూపర్‌వైజర్లు, బూత్ స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. బూత్‌స్థాయి అధి కారుల ఖాళీలను వెంటనే భర్తీ చేసి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలిపారు. ఆయా పార్టీల నుంచి బూత్ స్థాయి ఏజెంట్ల జాబితా తీసుకోవాలని, ఆ యా పార్టీలకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రాముఖ్యతను తెలుపాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులకు ప్రక్రియ నిర్వహణలో సందేహాలంటే నివృత్తి చేయాలని తెలిపారు. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఫా రం 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాల ని సూచించారు. కలెక్టర్ హరిత మాట్లాడుతూ.. జి ల్లాలో 678 పోలింగ్ కేంద్రాలున్నట్లు తెలిపారు. ప్ర తీ పోలింగ్ కేంద్రానికి ఒక బూత్ స్థాయి అధికారిని నియమించినట్లు పేర్కొన్నారు. బూత్ స్థాయి అధి కారులు, సూపర్‌వైజర్లకు ఇదివరకే శిక్షణ ఇచ్చి వారి కి గుర్తింపు కార్డులు అందజేశామని తెలిపారు. బూ త్ స్థాయి ఏజెంట్ల జాబితాను గుర్తింపు పొందిన రా జకీయ పార్టీల నుంచి తీసుకుంటున్నట్లు పేర్కొన్నా రు. త్వరలో చేపట్టే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ద శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


