కౌటాల: రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తూ సేంద్రియ వ్యవసాయం చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కేవీకే శాస్త్రవేత శ్రీనివాస్ సూచించారు. శనివారం విజయవాహిని చారి టబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని గురుడుపేట గ్రామంలో చేపల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రా మీణ ప్రాంత రైతులు వ్యవసాయంతో పాటు చేపలు, కోళ్లు పెంచాలని సూచించారు. రైతులకు సబ్సిడీపై చేపలు, దాణా అందజేస్తూ.. పెంపకంపై సలహాలు, సూచనలు ఇస్తామని పేర్కొన్నారు. రైతులు చిరుధాన్యాలను సాగు చేయాలని, చేపలు, కోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. సిబ్బంది గజానంద్, అరుణ్, వినయ్, సుమలత, నాయకులు మెర్పల్లి బ్రహ్మయ్య, నారాయణ, విజయ్, శంకర్, సిద్దు, రైతులు పాల్గొన్నారు.


