కాగజ్‌నగర్‌టౌన్: వందశా తం పన్ను ల లక్ష్యాన్ని చేరుకునేందుకు కాగజ్‌నగర్ పట్టణ పరిధిలోని ప్రజలకు మున్సిపల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను, నీటి, కులాయి చార్జీలను పూర్తిగా చెల్లించిన వారికి లక్కీడ్రా ద్వారా బహుమతులు అందిస్తున్నట్లు ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తున్నారు. మొదటి బహుమతిగా రిఫ్రిజిరేటర్, రెండో బహుమతి మిక్సర్ గ్రైండర్, మూడో బహుమతి రైస్ కుక్కర్‌ను లక్కీడ్రా ద్వారా అందిస్తున్నట్లు ప్రకిటించారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ తిరుపతి కోరారు.


