కెరమెరి: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ పరీక్ష కు అనూహ్య స్పందన వచ్చింది. జిల్లావ్యాప్తంగా 345 కేంద్రాలు ఏర్పాటు చేయగా, స్వయం సహయక సంఘాల్లో ని మహిళలు దాదాపు 80 శాతం మంది ఉదయమే పరీక్షలు రాశారు. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నా మధ్యాహ్నం 2 గంటలకే పరీక్ష ముగిసింది. దాదాపు 11,903 మందికి పైగా పరీక్షలు రాసినట్లు ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్ తెలిపారు. కాగా, ఆసిఫాబాద్ మండలం బూర్గుడ పాఠశాలలో నిర్వహించిన పరీక్షను డీఆర్‌డీవో దత్తారావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న సాక్షరత భారత్ స్థానంలో ఉల్లాస్‌ను తీసుకువచ్చినట్లు తెలిపారు. మహిళలకు చదవడం, రాయడం నేర్పడమే ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.


