వంకులం @41.5 డిగ్రీలు | - | Sakshi
Sakshi News home page

వంకులం @41.5 డిగ్రీలు

Mar 30 2026 8:42 AM | Updated on Mar 30 2026 8:42 AM

కౌటాల: కొద్దిరోజులుగా అకాల వర్షాలు, మ బ్బులు పట్టిన ఆకాశం, చల్లగాలులతో ఆహ్లా దకర వాతావరణం ఉండగా, మళ్లీ భానుడు భగ్గుమంటున్నాడు. గడిచిన మూడు రోజులు గా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటుతున్నాయి. గాలిలో తేమ తగ్గిపోవడంతో ఉదయం 9 గంటల నుంచే ఉక్కపోతతో జనం విలవిలలాడుతున్నారు. వేడి కారణంగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఆదివారం రెబ్బెన మండలం వంకులంలో పగటి ఉష్ణోగ్రత 41.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, కాగజ్‌నగర్‌లో 41.4, వాంకిడి 41.2, కౌటాల 41.1, సిర్పూర్‌(టి) 41.0, ఆసిఫాబా ద్‌ 40.9, తిర్యాణిలో 40.8 డిగ్రీలుగా నమోదైంది. జిల్లాలోని 12 మండలాలు అలర్ట్‌ జోన్‌లో ఉండగా.. మిగతా మూడు మండలాలు వాచ్‌ జోన్‌లో ఉన్నాయి. మరో నాలుగైదు రోజులపాటు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement