కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని వ్యవసాయ మార్కె ట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దహెగాం మండలంలోని కర్జి, గిరవెల్లి ప్రాంతాల్లో వెయ్యి క్వింటాళ్ల శనగల ఉత్పత్తి జరిగిందని తెలిపారు. రైతులకు అందుబాటులో శనగ కొనుగోలు కేంద్రాన్ని తెచ్చేందుకు మార్క్‌ఫెడ్ అధికారులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్వింటాల్‌కు రూ.5,875 మద్దతు ధర కు శనగలను అమ్ముకోవాలని, దళారుల చేతికి ఇచ్చి మోసపోవద్దని కోరారు. కార్యక్రమంలో మా ర్కెట్ కమిటీ చైర్మన్ సుద్దాల దేవయ్య, జిల్లా వ్యవసాయాధికారి వెంకట్, జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్, ఏడీఏ మనోహర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్యాముల్, వ్యవసాయాధికారులు ప్రేమలత, కార్తీష, దుర్గాభవాని, సృజన, శ్రీనివాస్, పీఏసీఎస్ కార్యదర్శి సతీష్‌గౌడ్, ముక్తార్ పాల్గొన్నారు.


