● ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 7 వార్డులు
ఆసిఫాబాద్: మున్సిపల్ కౌంటింగ్ ఎట్టకేలకు ముగిసింది. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కాగజ్‌నగర్‌లోని డీఐఏ లక్ష్మిపత్ సింఘానియా పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో పుర ప్రజలు విలక్షణ తీర్పునిచ్చారు. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించలేకపోయింది. రెండు మున్సిపాలిటీల్లోనూ హంగ్ ఏర్పడింది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులకు బీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 7, స్వతంత్రులు 4 వార్డులు గెలుపొందగా, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో కాంగ్రెస్ 9, బీఆర్‌ఎస్ 11, బీజేపీ 5, స్వతంత్రులు 4, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించింది. చైర్మన్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో రెండు మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్ల మద్దతు అనివార్యం కానుంది. దీంతో స్వతంత్ర అభ్యర్థులు కింగ్ మేకర్‌గా నిలవనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్ దీపక్ తివారి పర్యవేక్షించారు. కాగజ్‌నగర్‌లో ఎస్పీ నితిక పంత్, ఆసిఫాబాద్‌లో ఏఎస్పీ చిత్తరంజన్ బందోబస్తును పర్యవేక్షించారు.
ఆసిఫాబాద్‌లో ఇలా..
జిల్లా కేంద్రంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తయింది. తొలి రౌండ్‌లో బీఆర్‌ఎస్ ఐదుగురు, కాంగ్రెస్ నలుగురు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. ఈ క్రమంలో రెండో రౌండ్‌లో ఉన్న అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఊహించని విధంగా స్వతంత్రులు విజయం సాధించడంతో ప్రధాన పార్టీలు కంగుతిన్నాయి. మొదటి నుంచీ గెలుపుపై నమ్మకంతో ఉన్న 11 వార్డులోని బీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థి రాపర్తి రవీందర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి రాపర్తి కార్తీక్ 103 ఓట్లతో విజయం సాధించాడు. అలాగే ఆరో వార్డులో నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరుతో చివరకు బీఆర్‌ఎస్ అభ్యర్థి చిలువేరు వెంకన్న 48 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థులు ఒకటో వార్డులో జాడె వినోద్‌కుమార్, రెండో వార్డులో వైరాగడే గోవింద్, పదో వార్డులో కాంబ్లె భాగ్యలక్ష్మి, 18వ వార్డులో కస్తూరి పుష్పలత అనూహ్యంగా విజయ బావుటా ఎగురవేశారు.
అత్యధిక మెజార్టీ 165 ఓట్లు
15 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్లా 277 ఓట్లు సాధించి బీఆర్‌ఎస్ అభ్యర్థిపై 165 ఓట్ల మెజార్టీ సాధించగా, 17వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎండీ అహ్మద్ 278 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అసద్‌పై 163 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పదో వార్డులో స్వతంత్ర అభ్యర్థి కామ్రె భాగ్యలక్ష్మి 146 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి చునార్కర్ రాజ్‌కుమార్‌పై 8 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. 18వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కస్తూరి పుష్పలత 169 ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి సైద్ హుమా జవేరియాపై 13 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అతి చిన్న వయస్సు కలిగిన కౌన్సిలర్‌గా ఒకటో వార్డు విజేత జాడి వినోద్‌కుమార్(26), ఆ తర్వాత 3వ వార్డు విజేత మెంగ్రె ఆకాశ్(27) నిలిచారు. అత్యధిక వయస్సు కలిగిన కౌన్సిలర్‌గా పదో వార్డులో విజ యం సాధించిన కామ్రె భాగ్యలక్ష్మి(60) నిలిచారు. అలాగే విజేతల్లో ఒకరు గ్రాడ్యుయేట్ ఉండగా, 13 మంది అండర్ గ్రాడ్యుయేట్లు, మరో ఆరుగురు అభ్యర్థులు నిరక్షరాస్యులు ఉన్నారు. ఆసిఫాబాద్‌లో మొత్తం పది మంది మహిళలు గెలుపొందగా వారందరూ గృహిణులు కావడం విశేషం.
కౌంటింగ్ కేంద్రంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, అధికారులు
కౌంటింగ్ కేంద్రంలో వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ కె.హరిత
మున్సిపల్ ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చిన ఓటర్లు
పార్టీల వారీగా గెలిచిన వార్డులు
మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం స్వతంత్రులు
ఆసిఫాబాద్ 09 07 0 0 04
కాగజ్‌నగర్ 11 09 05 1 04
● ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 7 వార్డులు
● ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 7 వార్డులు
● ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 7 వార్డులు
● ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 7 వార్డులు


