ఓటు వజ్రాయుధం
కాగజ్‌నగర్‌టౌన్: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. ఓటరు దినోత్సవం సందర్భంగా ఆదివారం నవోదయ విద్యాలయం విద్యార్థులతో కలిసి సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. చౌరాస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పట్టణంలోని అన్ని చౌరస్తాల్లో ఓటరు అవగాహన బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీనియర్ ఓటర్లు(వృద్ధులు), కొత్త ఓటర్లు, బీఎల్‌వోలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధుకర్, ఎంఈవో ప్రభాకర్, నవోదయ ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.


