మాజీ మంత్రి వెంకటస్వామికి నివాళి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో సోమవారం కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతి అధికారికంగా నిర్వహించారు. వెంకటస్వామి చిత్రపటానికి ఎస్పీ నితిక పంత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి నిర్వహిస్తోందని తెలిపారు.


