సర్పంచ్ గైర్హాజరు.. చీపుర్లతో ఉప సర్పంచ్ రాక
వాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మేజర్ గ్రామ పంచాయతీలో సోమవారం నిర్వహించిన ప్రమాణ స్వీకారానికి సర్పంచ్, ఏడుగురు వార్డు సభ్యులు గైర్హాజరయ్యారు. ఉప సర్పంచ్ దీపక్ ముండె, ఆరుగురు వార్డు సభ్యులు మాత్రం పంచాయతీలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రోడ్లు ఊడ్చే చీపుర్లు, తట్టలతో హాజరయ్యారు. ఉప సర్పంచ్ ఎన్నిక సమయంలో జరిగిన వివాదంతోనే సర్పంచ్, వార్డు సభ్యులు కార్యక్రమానికి హాజరుకాలేదని తెలుస్తోంది. కోరం లేకపోవడంతో మొదటి సమావేశం వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి ప్రకటించారు.


