టెంట్ల కిందే ప్రమాణం
దహెగాం(సిర్పూర్): మండలంలోని పలు పంచా యతీల్లో కార్యాలయాలు లేక టెంట్లు, అంగ న్‌వాడీ కార్యాలయాల్లో పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేశాయి. దిగిడలో పక్కా భవనం లేనందున అంగన్‌వాడీ కేంద్రంలో సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గిరవెల్లి రైతువేదికలో, గెర్రెలో పాఠశాల భవనం, పీపీరావు కాలనీలో పాఠశాల భవనం, కమ్మర్‌పల్లి, బొర్లకుంటలో పాఠశాల భవనాలు, కల్వాడ అద్దె భవనం, బామనగర్‌లో అసంపూర్తిగా ఉన్న జీపీ భవనం ఎదుట టెంటు కింద, పెసరికుంట జీపీ భవనం లేనందున టెంటు కింద కార్యక్రమాలు నిర్వహించారు.


