నిధుల కోత.. సాదాసీదాగా వేడుక
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఆవిర్భావ దినోత్స వం అంటే కార్మికుల పండుగ. కార్మికులు, వారి కు టుంబ సభ్యులను భాగస్వాములను చేస్తూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వేలాది మంది కా ర్మికులు, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పి స్తున్న సిరుల తల్లి సింగరేణి సంస్థ ఆవిర్భవించిన రోజును ఆర్భాటంగా జరుపుకొంటారు. అయితే ఈ ఏడాది యాజమాన్యం వేడుకలను పరిమితం చేయనుంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదా గా నిర్వహించాలని సర్క్యులర్ జారీ చేసింది.
నిధుల్లోనూ కోత
డిసెంబర్ 23న బెల్లంపల్లి ఏరియాలో నిర్వహించే సింగరేణి ఆవిర్భావ వేడుకలకు ఏటా భీమన్న స్టేడి యం వేదికగా నిలుస్తుంది. స్టాల్స్ ఏర్పాటుతో మై దానం రోజంతా సందడిగా మారుతుంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీనికోసం యాజమాన్యం ఏరియాకు రూ.2.5లక్షల కేటాయించేది. కానీ మంగళవారం నిర్వహించే వేడుకలను పరిమితం చేయడంతోపాటు నిర్వహణ నిధుల్లోనూ భారీగా కోత విధించారు. కేవలం రూ.50వేలు మాత్రమే కేటాయించారు. భీమన్న స్టేడియంలో కాకుండా జీఎం కార్యాలయం ఆవరణలోనే వేడుకలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం సింగరేణి పతాక ఆవిష్కరణ, అనంతరం కేక్ కటింగ్ చేయనున్నారు. ఆ తర్వాత ఉత్తమ ఉద్యోగులు, అధికారులను సన్మానించనున్నారు. వేడుకలు సాదాసీదాగా నిర్వహించడంపై గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీతోపాటు ఇతర కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఏఐటీయూసీ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. ఏర్పాట్లు లేకపోవడంతో భీమన్న స్టేడియం వెలవెలబోతోంది.


